Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరిగెడుతోన్న గుర్రం పై నుంచి పడిపోయాను: సీనియర్ హీరో ఆనంద్

  • చాలా కాలం నుంచి వెన్ను నొప్పి 
  • ఒక షూటింగులో మోకాలు కూడా దెబ్బతింది
  • 3 ఆపరేషన్లు జరిగాయి  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరో ఆనంద్ మాట్లాడుతూ, 'దొంగ దొంగ' సినిమాలో తనకి జరిగిన ప్రమాదాలను గురించి ప్రస్తావించాడు. "ఈ సినిమాలో నేను గుర్రంపై వేగంగా వెళుతుండగా వెనక నుంచి ఒక ఫైటర్ వచ్చి నన్ను పట్టుకోవడంతో, ఆయనతో పాటు కింద పడిపోవాలి. సీన్ బాగానే వచ్చింది .. కానీ అప్పటి నుంచి వెన్నెముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతూనే వున్నాను.

ఆ తరువాత మరో సినిమా చేస్తున్నప్పుడు మరో ప్రమాదం జరిగింది. పరిగెడుతూ .. పరిగెడుతూ పడిపోవడం వలన మోకాలు బాగా దెబ్బతింది. అప్పటికి ఇంకా ఆ సినిమా షూటింగ్ 15 రోజులు వుంది. సమస్య తీవ్రంగానే ఉందని డాక్టర్ చెప్పారు .. 'ఏమీ కాదు షూటింగులో పాల్గొన వచ్చని ఆయనకి చెప్పండి .. లేకపోతే నేను నష్టపోతాను' అని డాక్టర్ తో నిర్మాత అనడం నేను విన్నాను. నిజమే కదా అనుకుని .. తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకుని షూటింగు పూర్తి చేశాను. కానీ మోకాలు బాగా వాచిపోయి .. 3 ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు. 
aanand

More Telugu News